![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ ఇనాయ సుల్తానా గురించి అందరికీ తెలుసు. అలాగే బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మంచి పేరు తెచ్చుకుని హీరో అయ్యాడు సోహైల్ కూడా బాగా తెలుసు. ఇనాయ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆర్జే సూర్యతో కలిసి కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం సోహైల్ కి లవ్ ప్రొపోజ్ చేసింది. దీనికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఒక రెస్టారంట్ లో "లక్కీ లక్ష్మణ్" మూవీ టీమ్ కూర్చుకుని ఉండగా ఇనాయ లోపలికి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో సోహైల్ హీరోగా నటించాడు. "నువ్ లోపలికి వస్తుంటే ఏమిటి ఇలా వచ్చింది అని షాకయ్యాను" అన్నాడు సోహైల్.
"బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ నీతోనే మాట్లాడుతున్నాను. నా మనసులో ఉన్న విషయం నీకు చెపుదామనుకుంటున్నా.. మీరేమనుకున్నా పర్వాలేదు" అని ఫ్లవర్ బొకే తీసుకుని సోహైల్ దగ్గరకు వెళ్లి "ప్రేమ ఉన్నంతవరకు మాత్రమే కాదు నా ప్రాణం ఉన్నంతవరకు ప్రేమిస్తాను" అని మోకాళ్లపై కూర్చుని ఒక రోజ్ ఇచ్చి ప్రొపోజ్ చేసింది ఇనాయ. "మీకు ప్రొపోజ్ చేయడం కోసమే ఇలా రెడీ అయ్యి వచ్చాను..మీరంటే నాకు చాలా ఇష్టం. బిగ్ బాస్ లో చూసినప్పటినుంచి నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. ఎలా చెప్పాలో తెలియడం లేదు బిగ్ బాస్ లో మీరంటే క్రష్ అని చెప్పా కానీ నా మనసులో ఫీలింగ్ ఎప్పుడూ చెప్పలేదు ..ఐ రియల్లీ లవ్ యు" అని సిగ్గుపడుతూ చెప్పింది ఇనాయ. సోహైల్ కి ఏం ఆన్సర్ చెప్పాలో అర్థంకాలేదు.
ఇంతలో "వెయిట్ ఫర్ ది సోహైల్ రెస్పాన్స్" అని ఒక లైన్ కనిపించింది. ఐతే ఇనాయ ప్రొపోజల్ ని సోహైల్ యాక్సెప్ట్ చేస్తాడా, లేదా అనేది తెలియాలంటే ఫుల్ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయాలి.
![]() |
![]() |